జ్యోతిష్యం:  మేషరాశిలోకి శుక్రుడు.. ఈ మూడు రాశుల వారికి దశ తిరిగినట్టే..! 

జ్యోతిష్యం:  మేషరాశిలోకి శుక్రుడు.. ఈ మూడు రాశుల వారికి దశ తిరిగినట్టే..! 

జ్యోతిషశాస్త్రంలో శుక్రుడు ప్రేమ, అందం, లగ్జరీ, సృజనాత్మకత, సంపద, శ్రేయస్సు, వైవాహిక ఆనందానికి కారకంగా పరిగణించబడుతున్నాడు. శుక్ర గ్రహం  రాక్షసుల గురువుగా కూడా పరిగణించబడుతున్నాడు. మార్చి 26 వ తేది ఉదయం 05:13 గంటలకు శుక్రగ్రహం.. కుజుడు పాలించే  మేషరాశిలోకి ప్రవేశించనున్నాడు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారంగా  శుక్ర గ్రహం మేషరాశిలోకి మారడం వలన  మూడు రాశుల వారికి  దశ తిరిగి.. బాగా అభివృద్ది చెందుతారని పండితులు చెబుతున్నారు.  ఇప్పుడు ఆ రాశుల గురించి తెలుసుకుందాం. 

  మేషరాశి:  శుక్రుడు ఇదే రాశిలోకి ప్రవేశిండచం వలన .. ఇప్పటి వరకు ఎదుర్కొంటున్న సమస్యలకు మంచి పరిష్కారం లభిస్తుందని పండితులు అంటున్నారు.  ముఖ్యంగా పెళ్లి కోసం ఎదురు చూసే వారు గుడ్​ న్యూస్​ వినే అవకాశం ఉంది.    వృత్తి, వ్యాపారంలో అనుకోకుండా లాభాలు చేకూరతాయి. ఉద్యోగస్తులకు ప్రమోషన్​ వచ్చే అవకాశం ఉంది. ప్రేమ, వైవాహిక జీవితం చాలా సంతోషంగా ఉంటుంది.

వృషభ రాశి:   మేషరాశితో శుక్రుడు సంచరించేటప్పుడు ఈ రాశి వారికి చాలా అద్భుతమైన ఫలితాలుంటాయని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.  ఆర్థిక విషయాలో సానుకూల మార్పులు వస్తాయి.  అయితే ప్రతి విషయాన్ని ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి,  ఎవరి నిర్ణయాలను అమలు పరచవద్దు.  సొంతంగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న ఉద్యోగం లభిస్తుంది. ప్రస్తుతం చేస్తున్న వృత్తిలో స్థాన చలనంతో పాటు ప్రమోషన్​ వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. జాయింట్​ వ్యాపారాలు కలసి వస్తాయి. ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న పనులు పూర్తి అవుతాయి.

సింహరాశి:  ఈ రాశి వారికి మేషరాశిలో శుక్రడు సంచరించే సమయంలో ఆర్థికంగా స్థిరపడే అవకాశంఉంది.  కొత్త వ్యాపారాలు ప్రారంభించేందుకు అవకాశాలు ఎక్కువుగా ఉన్నాయి.  వృత్తి, వ్యాపారంలో అనుకోకుండా లాభాలు చేకూరతాయి. ఉద్యోగస్తులకు ప్రమోషన్​ వచ్చే అవకాశం ఉంది. ప్రేమ, వైవాహిక జీవితం చాలా సంతోషంగా ఉంటుంది.  గతంలో రావలసిన బకాయిలు వసూలవుతాయి.ఆర్ధిక విషయంలో గతంలో కంటె పరిస్థితి  మెరుగుపడుతుంది. ప్రేమ విషయాలు అనుకూలిస్తాయి. 

Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని జ్యోతిష్య నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న  జ్యోతిష్య సమస్యలకు నిపుణులను సంప్రదించటం ఉత్తమం.